ఉప్పు ఉప్పు ఉప్పు ఐ డోన్’ట్ like ఇట్, బట్ ఉప్పు లేకపోతే ఫుడ్ కి రుచిపోతుంది సో ఐ cannot avoid .
మంచిగా చెప్పనా డైలాగ్..ఈ ఆర్టికల్ లో ఉప్పు ఎక్కువగా ఎందుకు తినకూడదు మాట్లాడుకుందాం. ఇక స్టార్ట్ చేద్దాం మల్ల.
అమ్మ ఈ కూర చప్పగా ఉందే, అస్సలు తినానికి లేదే అని వింటుంటాం. ఈ విషయం చదివాక మీకు అర్థం అవుతుంది ఉప్పు కొంచెం తగ్గితే పర్లేదులే అని.
ఆహరం లో సాల్ట్ ని ఎక్కువగా తీసుకోకూడదు, ఆలా ఎక్కువగా తీసుకోవడం వాళ్ళ రక్త నాళాలలోకి వెళ్లి రక్తనాళాలకి అంటి పెట్టుకొని రక్త నాళాలని హార్డ్ గ చేస్తుంది.
ఆహారంలో ఉప్పును వాడకం ఎంత తగ్గిస్తే .. అంత మంచిగుంటది మీ ఆరోగ్యం. లేకపోతే ఆ ఉప్పే స్లో పాయిజన్‌గా మారి మీ ఆరోగ్యాన్ని హరించే ప్రమాదం ఉంది సుమీ.
ఇటీవల కొన్ని సంస్థలు జరిపిన పెద్ద సర్వేల్లో తేలిన విషయం ఏంటంటే.. ఉప్పు (సాల్ట్) లేదా సోడియం ఎక్కువగా తీసుకోవడం వల్ల మన ఆయుష్షు క్షీణిస్తోందని తేలింది.
మరి ఎంత ఉప్పు తీసుకోవాలి అదికూడా మీరే చెప్పండి మల్ల అంటారా ఇందా చదవండి మరి ?: మన దక్షిణాది వంటకాల్లో ఉప్పు వాడకం ఎక్కువ. కాబట్టి.. తప్పకుండా జాగ్రత్తలు పాటించాలి మరి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచనల ప్రకారం… రోజుకు 5 గ్రాముల ఉప్పు తీసుకోవచ్చు. అయితే, భారతీయులు రోజుకు 11 గ్రాముల ఉప్పును తీసుకుంటున్నట్లు సమాచారం.
ఇవిగో ఇవే ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వాళ్ళ కలిగే అనర్థాలు:
❂ శరీరంలో సోడియం స్థాయిలు ఎక్కువగా ఉంటే.. రాత్రిపూట సరిగా నిద్రపట్టకపోవచ్చు.
❂ తరచు మూత్రం వచ్చే అవకాశం ఉంది.
❂ ఆహారం ద్వారా వెళ్లే ఉప్పులోని సోడియం రక్తంలో కలిసి నీటి ఉత్పత్తి పెరుగుతుంది. ఫలితంగా రక్తం పరిమాణం పెరిగి మూత్రం ఉత్పత్తి కూడా ఎక్కువ అవుతుంది. దీంతో ఎక్కువ సార్లు మూత్రం వస్తుంటుంది.
❂ ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల రక్తం పరిమాణం పెరిగి రక్తపోటు (బీపీ) అధికమవుతుంది అని పరిశోధనల్లో తేలింది.
❂ లో బీపీ ఉన్న వారు పగలు తీసుకునే ఆహారంలోనే కొంచెం ఎక్కువ ఉప్పు వేసుకుని తిన్న పర్లేదు కానీ . రాత్రిళ్లు మాత్రం తక్కువ ఉప్పు తినడం మంచిది.
❂ ఉప్పులో (సాల్ట్) లో ఉండే సోడియం శరీరానికి చాలా ముఖ్యమైంది. అలాగని అవసామయిన మోతాదుకు మించి తీసుకోకూడదు అని నిపుణులు చెప్తున్నారు.
పైవన్నీ చదివాక అసలు ఉప్పు ని తీసుకోవద్దు అని అనుకుంటున్నారా ఆలా అయితే మీరు పప్పు లో కాలు వేసినట్లే, ఎందుకంటారా అసలు ఉప్పు తీసుకోపోయిన ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తది అని తేలింది.
ఇందుమూలంగ యావన్మంది జనాలు లకు తెలియజేనునది ఏమనగా ఆహారంలో ఉప్పు ఎక్కువ కాకుండా, మరీ తక్కువ కాకుండా తగిన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి ప్రయోజనం ఉంటుంది.
ఈ ఆర్టికల్ మీకు మంచి హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనీ రాసింది మాత్రమే. ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ పుర్పొసెస్.